Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్య, బోయపాటి మూవీ ఆగిపోవడానికి కారణం..?

బాలయ్య, బోయపాటి మూవీ ఆగిపోవడానికి కారణం..?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు రూపొందడం.. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబోలో మూవీ రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దీంతో వీరి కలయికలో నాలుగవ సినిమా కన్ ఫర్మ్ అని.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి.

అయితే.. బాలయ్య నెక్ట్స్ మూవీని బోయపాటితో కాకుండా బాబీతో చేస్తున్నారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బాలయ్య నెక్ట్స్ మూవీని బోయపాటితో చేయకుండా బాబీతో చేయడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే…. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆగష్టుకి పూర్తవుతుంది. ఆతర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేసి డిసెంబర్ కి పూర్తి చేయాలి అన్నారట. ఎందుకంటే డిసెంబర్ నుంచి బాలయ్య ఎన్నికల హాడావిడిలో ఉంటారు. అయితే.. బోయపాటి అంత తక్కువ టైమ్ లో సినిమా చేయడం సాధ్యం కాదని చెప్పారట.

హాడావిడిగా సినిమా చేస్తే మొదటికే మోసం వస్తుంది. తనకు ఎక్కువ టైమ్ కావాలి అని చెప్పారట బోయపాటి. అందుచేత బాలయ్య బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారని సమాచారం. బాలయ్య, బాబీ కాంబో మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. జూన్ 10న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారు. అయితే.. బాలయ్య, బోయపాటి మూవీ వచ్చే సంవత్సరం ఎన్నికల తర్వాత ఉంటుందట. ఎన్నికల తర్వాత సినిమా అంటే… అఖండ 2 చేస్తారో..? లెజెండ్ 2 చేస్తారో అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్