Father Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన ఎఫ్ 3 ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో బాలయ్యతో చేయనున్న మూవీ స్టోరీ బయటపెట్టారు అనిల్ రావిపూడి.
ఇంతకీ స్టోరీ ఏంటంటే.. “తండ్రి, కూతురు మధ్య నడిచే కథ ఇది. తండ్రి పాత్రలో బాలయ్య, కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తారు. బాలయ్య ఇందులో కాస్త వయసుమళ్లిన పాత్రలో కనిపిస్తారు. సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. పోకిరి, గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు హీరోల పాత్రల చుట్టూ తిరుగుతాయి. బాలయ్య సినిమాను కూడా అదే టెంప్లేట్ లో చేద్దామని ప్రయత్నిస్తున్నాను. 50 ఏళ్ల వయసున్న ఓ తండ్రి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో అదే టోటల్ సినిమా” అని అనిల్ రావిపూడి చెప్పారు.
ఇప్పటి వరకు బాలయ్యను ఎవ్వరూ ఈ కోణంలో చూపించలేదు. ఇది ఓ ప్రయోగమే. మరి.. బాలయ్యతో చేసే ప్రయోగంతో అనిల్ రావిపూడి ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.