Thursday, May 30, 2024
HomeTrending Newsరాహుల్ యాత్రకు తెలంగాణలో ముమ్మరంగా ఏర్పాట్లు

రాహుల్ యాత్రకు తెలంగాణలో ముమ్మరంగా ఏర్పాట్లు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నేత చేయలేని సుదీర్ఘ పాదయాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ సెక్రటరీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మనిక్కం టాగూర్, ఏఐసీసీ సెక్రటరీ నదీము జావీద్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భారత్ జోడో యాత్ర, జన సమీకరణ పై ఈ రోజు సమీక్ష సమావేశం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి…. రాహుల్ గాంధీ యాత్ర కి ప్రజలు స్వచందగా తరలివస్తున్నారు,దేశ చరిత్రలో రాహుల్ గాంధీ యాత్రా నిలిచిపోతుందని తెలిపారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ 375 కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో మొబిలైజేషన్ కమిటీ కీలకపాత్ర పోషించబోతుందన్నారు. దేశంలో ఎవరూ చేయలేని ఓక సాహాసోపేత యాత్ర ను రాహుల్ గాంధీ చేస్తున్నారని, దేశ చరిత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర మైలు రాయి గా మిగలబోతుందన్నారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు చార్మినార్ గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగబోతుందని, నవంబర్ 1న నక్లెస్ రోడ్ లోని ఇంధిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారని చెప్పారు.

ఉదయం 6 గంటలకే పాదయాత్ర ప్రారంభం అవుతుంది,ఉదయం 5 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ రెండు కిలోమీటర్లకు ఓక రిసీవింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి మునుగోడు భాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారు,మేము జోడో యాత్ర భాధ్యత తీసుకుని పనిచేస్తున్నామని, ప్రతీ రోజు రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో లక్ష మంది పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్