Saturday, July 27, 2024
HomeTrending Newsకోడంగల్ లో ఏం చేశారని మునుగోడు దత్తత - షర్మిల విమర్శ

కోడంగల్ లో ఏం చేశారని మునుగోడు దత్తత – షర్మిల విమర్శ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే దిగంగంత నేత వైఎస్సార్ కి చాలా ఇష్టమని జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు మరమత్తులు చేయించి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని, గుత్ప,అలీ సాగర్ ప్రాజెక్ట్ ల ద్వారా… 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా నిజామాబాద్ టౌన్ గాంధీ చౌక్ వద్ద YSR తెలంగాణ పార్టీ  ఈ రోజు నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రాణహిత – చేవెళ్ల ద్వారా మరో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని YSR అనుకున్నారని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్సార్ ఎంతో చేశారన్నారు.

వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఅర్ చేసింది ఎంటి..అని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని, 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తం అనే హామీ ఏమయ్యిందన్నారు. ఐటీ హబ్ అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఈ జిల్లా నుంచి వేల మంది గల్ఫ్ కి వెళ్తున్నారని, గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్ల నిధులు అన్నారు.. NRI సెల్ అన్నారు..ఏమయ్యింది..? నిజామాబాద్ పట్టణానికి ప్రతి ఏడాది 100 కోట్లు అన్నారు…ఎన్ని ఇచ్చారు..? ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎవరు..? ఈయన బిగాల గణేష్ గుప్త కాదు..భూముల గణేష్ గుప్తా అని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే జెండా పాతెయ్యడమే అంట కదా అన్నారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడే స్వాహా…పంచాయతీ చేయమని చెప్తే ఆ భూమి మొత్తం స్వాహా…జెండా పాతెయ్యడమే గణేష్ గుప్త పని అని విమర్శించారు.

బిగాల గణేష్ గుప్త కమీషన్లు లేకుండా ఏ పని చేయడట కదా అని షర్మిల ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే స్వీట్ బాయ్ అని పిలిపించుకుంటడట. అలా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. ఇక ఎంపీ అరవింద్ చేసింది ఎంటి..? బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసమే చేశాడు కదా అన్నారు. నమ్మి ఓటేస్తే తెచ్చిండా పసుపు బోర్డ్ ? మళ్ళీ మోసమే చేశాడు కదా అన్నారు.

TRS అయినా…బీజేపీ అయినా అందరూ మోసగాళ్లని, ఈ నిజామాబాద్ బిడ్డలు గట్టోల్లని షర్మిల అన్నారు. దొర బిడ్డ అయినా…దొరసాని అయినా…మాట తప్పితే కర్రు కాల్చి వాత పెడతాం అని నిరూపించారని ప్రశంసించారు. ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వాళ్ళు ఈ నిజామాబాద్ బిడ్డలు అన్నారు. కేసీఅర్ బిడ్డను సైతం ఓడించారు అంటే మీరు సామాన్యులు కారని, పసుపు బోర్డ్ హామీ తప్పినందుకు ఓడించారు. ఇప్పుడు కవిత లిక్కర్ స్కాం నుంచి తప్పించేదుకు ఢిల్లీలో వారంపాటు మకాం వేశారని, బిడ్డ ఇక్కడ ఓడిపోయింది అని సిఎం కెసిఆర్ అల్లాడి పోయాడని వ్యంగ్యంగా విమర్శించారు. వెంటనే mlc పదవి ఇచ్చాడు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ..బిడ్డకు మాత్రమే ఉద్యోగం ఇచ్చాదన్నారు.

బీజేపీ కోటలు బద్దలు కొడతాం… మెడలు వంచుత అని చెప్పిన కేసీఅర్..వారి కాళ్ళ వెళ్ళ మీద పడ్డారట అని షర్మిల ఆరోపించారు. ఇక ఒక్క మునుగోడు ఎన్నికలకు మొత్తం ఎమ్మెల్యే లు అంతా దిగిపోయారు. నియోజక వర్గంలో సమస్యలు వస్తే పట్టింపు లేదు కానీ ఓట్లు కొనుక్కొనేందుకు వెళ్ళారని మండిపడ్డారు. గుడి ముందు బిచ్చగాళ్లు చిళ్ళర ఏరుకోవడానికి వెళ్లినట్లు వెళ్ళారు. కేసీఅర్ కొడుకు కెటిఆర్ ఇప్పుడు మునుగోడు ను దత్తత తీసుకుంటారట. ఇంతకు ముందు మీకు మునుగోడు కనిపించడం లేదా…మునుగోడు ఏమైనా పాకిస్థాన్ లో ఉందా…;మునుగోడు ఏమైనా ఆఫ్గన్ లో ఉందా…లేక పక్కా రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ కొత్తగా దత్తత తీసుకోవడం ఎంటని, ఇప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. గతంలో దత్తత తీసుకున్న కొడంగల్ పరిస్థితి ఎంటి..? ఇప్పుడు మునుగోడు దత్తత తీసుకుంటే ఏమవుతుందని అన్నారు. ఇంత మంది ఎమ్మెల్యే లు అక్కడ పోవాల్సిన అవసరం ఎంటి..? మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే…మీ పాలన చూసి ఓట్లు వేయాలి కదా. సిగ్గు లేకుండా ఇంతమంది ఎమ్మెల్యే లు వెళ్తారా..? ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం అప్పజెప్తర ? మీ పాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టే ఎమ్మెల్యే లు పంపారని విమర్శించారు.

మునుగోడులో మద్యం ఏరులై పారుతోందని, మీరు దత్తత తీసుకుంటే మీ సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తారా…లేక కాళేశ్వరం కమీషన్ లతో అభివృద్ధి చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ఫీనిక్స్ కంపెనీ డబ్బులతో అభివృద్ధి చేస్తారా? కవిత లిక్కర్ స్కాం డబ్బులతో అభివృద్ధి చేస్తారా? ప్రజల డబ్బులతో అభివృద్ధి చేయడానికి దత్తత అనే పేరు ఎందుకు అన్నారు. 8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట..పడింది పాటగా సాగిందన్నారు. నేను వైఎస్సార్ బిడ్డ ను..పులి కడుపున పులే పుడుతుందని, YSR సంక్షేమ పాలన తీసుకు వస్త అని షర్మిల భరోసా ఇచ్చారు.

Also Read : కెసిఆర్ పాలనలో 4 లక్షల కోట్ల అప్పులు – షర్మిల  

RELATED ARTICLES

Most Popular

న్యూస్