Saturday, January 18, 2025
HomeTrending Newsమునుగోడుపై బిజెపి సమాలోచనలు

మునుగోడుపై బిజెపి సమాలోచనలు

జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, వివేక్, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి హాజరవగా… బండి సంజయ్ కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరస సమావేశాలతో శనివారం సునీల్ బన్సల్ బిజీగా గడిపారు. బీజేపీ స్టీరింగ్ కమిటీ, మండల ఇంచార్జ్‌లతో, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటితో బన్సల్ సమీక్ష జరిపారు. మునుగోడు పరిస్థితులపై రాత్రి అమిత్ షాకు రాష్ట్ర ఇంచార్జ్ వివరించారు. దీంతో కార్యవర్గ సభ్యులతో సమావేశం కావాలని అమిత్ షా ఆదేశించారు. షా ఆదేశాలతో మునుగోడు ఉప ఎన్నికపై జాతీయ కార్యవర్గ సభ్యులకు బన్సల్ పలు సూచనలు చేశారు.

Also Read: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్