Monday, April 15, 2024
Homeజాతీయంబిజెపి ఎంపి అభ్యర్థుల మొదటి జాబితా

బిజెపి ఎంపి అభ్యర్థుల మొదటి జాబితా

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి శనివారం విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను  ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే ప్రకటించారు. ఈసారి 370 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బిజెపి బరిలోకి దిగుతోంది. NDA కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ లిస్ట్‌లో మొత్తం 34 మంది మంత్రులు ఉండగా 57 మంది ఓబీసీలకు అవకాశం దక్కింది. యువతకు 47 స్థానాలు కేటాయించినట్టు వినోద్ తావడే వెల్లడించారు. ఎస్సీలకు 27, ఎస్సీలకు 18 సీట్లు కేటాయించారు. మొత్తం అభ్యర్థుల్లో 28 మంది మహిళలకు అవకాశమిచ్చారు. యుపి – 52, పశ్చిమ బెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 24, గుజరాత్‌లో 15, రాజస్థాన్‌లో 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కేరళ- 12 సీట్లు, తెలంగాణ-9 సీట్లు, అసోం-11, ఝార్ఖండ్ -11, ఛత్తీస్ గఢ్ -11, ఢిల్లీ- 5 సీట్లు, జమ్మూ కశ్మీర్ 2, ఉత్తరాఖండ్ – 3, అరుణాచల్ ప్రదేశ్-2, అరుణాచల్ ప్రదేశ్, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, డామన్ డయ్యూ 1,  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా మరి కొందరు కీలక నేతల పేర్లున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగనున్నారు. ఎప్పటిలాగే అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు బరిలోకి దిగనున్నారు.  దాదాపు 15 రోజులుగా ఈ జాబితాపై కమలనాథులు మేధోమథనం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా పలు దఫాలు సమావేశమై జాబితాని పూర్తిగా పరిశీలించి ఆమోద ముద్ర వేశారు.

వివాదాస్పదం కాని స్థానాలకు మొదటగా అభ్యర్థులను ప్రకటించారు. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ లో 52 మంది అభ్యర్థులను ఖారారు చేశారు. బిహార్ సిఎం నితీష్ కుమార్ తో చర్చలు కొలిక్కి రాకపోవటంతో ఆ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టారు. మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బిజెపి అగ్రనేతలు… విపక్షం బలంగా ఉండటంతో సమ ఉజ్జీలను వెతికే పనిలో ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్