రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వనించారు.
హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ తదితరులు కూడా సిఎంకు రాకీ కట్టిన వారిలో ఉన్నారు.
Also Read : చెట్లకు రాఖీలు…