Sunday, January 19, 2025
Homeసినిమామరో మల్టీస్టారర్ కు చరణ్ ఓకే?

మరో మల్టీస్టారర్ కు చరణ్ ఓకే?

ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ,  కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించారు. దేశవిదేశాల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకుని..  ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌ మరోసారి మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ‘ఆచార్య’ లో తండ్రితో కలిసి నటించాడు, ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్, ఆచార్య.. ఇలా వరుసగా రెండు మల్టీస్టారర్ లు చేసిన చరణ్‌ దగ్గరకు మరో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘సీతారామం’ తో సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి తదుపరి సినిమాను సూర్యతో చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూర్యకు కథ కూడా చెప్పాడని తెలిసింది. అయితే.. సూర్యకు చెప్పిన కథలో హీరో పాత్రతో పాటు మరో కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని హనుకు సూర్య సలహా ఇచ్చాడట.

సూర్య సూచన మేరకు హను.. చరణ్ కు ఈ కథను చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. హను దర్శకత్వంలో రామ్ చరణ్ గతంలో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా స్టార్ట్ కాలేదు. అసలు సూర్య, హను ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? అలాగే చరణ్‌ ఇందులో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

Also Read : చరణ్‌, బన్నీని ఫాలో అవుతున్న నాని..

RELATED ARTICLES

Most Popular

న్యూస్