ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ శ్రీనగర్ చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టార్చ్ ను స్వీకరించి అనంతరం దాన్ని గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ తిప్సేకు అందజేశారు. శ్రీనగర్ నుంచి జమ్మూ చేరుకోనుంది.
తమిళనాడులోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్ట్ 10 వరకూ ద ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఆధ్వర్యంలో 44వ చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ప్రపంచంలోని 189 దేశాలనుంచి ఆటగాళ్ళు ఈ మెగా ఈవెంట్ లో ఆడనున్నారు. ఫిడే అధ్యక్షుడు అర్కడే ద్వోర్కొవిచ్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధాని మోడీ ఆదివారం ఈ టార్చ్ ను ఆవిష్కరించారు. అనతరం ఈ టార్చ్ ఢిల్లీ నుంచి లెహ్ చేరుకుంది. అక్కడ లధక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్ టార్చ్ స్వీకరించి గ్రాండ్ మాస్టర్ దివ్యేందు బారువాకు అందించారు. తర్వాత ఈ ర్యాలీ శ్రీనగర్ చేరుకుండు. అక్కడి నుంచి జమ్మూ చేరుకోనుంది.
దేశవ్యాప్తంగా 70 ఎంపిక చేసిన నగరాలలో ఈ టార్చ్ ర్యాలీ సాగనుంది, మెగా టోర్నీ ప్రారంభానికి ముందు మహాబలిపురం చేరుకోనుంది.