సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ ఎన్.వి రమణ దంపతులకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ప్రధాని న్యాయమూర్తికి ఆలయంలోకి స్వాగతం పలికారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ దంపతులు బాలాలయంలో ప్రత్యెక పూజలు చేశారు. పండితులు వారికి వేదాశిర్వచనం చేశారు.
ఆలయ అభివృద్ధి పనులు, నిర్మాణాల విశిష్టతను మంత్రులు, అధికారులు చీఫ్ జస్టిస్ కు వివరించారు. యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహంలో చీఫ్ జస్టిస్ బస చేయగా రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.