Saturday, November 23, 2024
HomeTrending Newsప్రాణ నష్టం లేకుండా చూడండి: సిఎం

ప్రాణ నష్టం లేకుండా చూడండి: సిఎం

Review on Floods: వరద ముంపు బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.  గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉదయం అధికారులతో మాట్లాడిన  ముఖ్యమంత్రి గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై  అధికారులు సిఎంకు వివరాలు అందించారు.

అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని,  మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.  సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలన్నారు.  వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలని చెప్పారు.  ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలని, ఈ  పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని  వైఎస్ జగన్ ఆదేశించారు.

Also Read : రాబోయే 24 గంటలు హైఅలర్ట్‌ : సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్