Wednesday, March 26, 2025
HomeTrending Newsఆదిత్య గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ నేడే ప్రారంభం

ఆదిత్య గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ నేడే ప్రారంభం

Caustic Soda Unit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ బలభద్రపురంలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులతో కాస్టిక్ సోడా యూనిట్ నెలకొల్పింది. దీని ద్వారా  ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1150 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అందులో 75% స్థానికులకు కేటాయించేందుకు సంస్థ అంగీకరించింది.

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బలభద్రపురం చేరుకుంటారు. అక్కడ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ను కుమార మంగళం బిర్లాతో కలిసి సందర్శించిన అనంతరం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు

Also Read : డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్