Sunday, January 19, 2025
HomeTrending Newsరేపు విశాఖకు సిఎం జగన్

రేపు విశాఖకు సిఎం జగన్

CM to Visakha: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం (ఏప్రిల్ 19) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో బస చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.

మనోహర్ లాల్ ఖట్టర్   వ్యక్తిగత పర్యటన కోసం శనివారం విశాఖ వచ్చారు. నగరంలోని నేచురోపతి పెమా వెల్నెస్ సెంటర్ లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న శారాదాపీఠం, సింహాచలం, టీటీడీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలను అయన సందర్శించారు. శనివారం ఖట్టర్ కు స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమరనాథ్ నిన్న ఆయనతో కలిసి విశాఖ టిటిడి దేవాలయాన్ని సందర్శించారు.

సిఎం జగన్ రేపు ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడినుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళతారు, అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్