Jagam to Meet Modi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు, రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. జవనరి మొదటి వారంలో సిఎం జగన్ ఢిల్లీ లో రెండ్రోజుల పాటు పర్యటించి ప్రధాని మోడీ తో పాటు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లను కలుసుకున్నారు.
ఇటీవల రాష్ట్రంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లు పర్యటించినప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన క్రెడిట్ ను వారికి ఇవ్వడంలో రాజకీయం చేయబోనని సిఎం జగన్ ప్రకటించిన విషయం గమనార్హం.
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిపై విపక్షాల విమర్శలు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సిఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను కూడా సిఎం జగన్ మరోసారి ప్రధానితో ప్రస్తావించే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలుసుకోనున్నారు. ప్రధాని- సిఎం భేటీలో రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read : వికేంద్రీకరణ మా మౌలిక సిద్దాంతం: జగన్