Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎం జగన్ ఉగాది శుబాకాంక్షలు

సిఎం జగన్ ఉగాది శుబాకాంక్షలు

Happy Ugadi:  రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి  శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని; సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి తన సందేశంలో సూచించారు.

Also Read : శుభకృత్ సంవత్సర ఫలాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్