Friday, November 22, 2024
HomeTrending Newsత్వరలోనే కొత్త పథకం

త్వరలోనే కొత్త పథకం

కేంద్రం నిధుల పై ఇటీవలి కాలంలో కొందరు నేతలు పదేపదే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చే నిధులు తప్పితే ప్రత్యేకంగా చేసింది ఏమిలేధన్నారు. రాష్ట్ర వాటాగా కేంద్రం నుంచి కేవలం 24 వేల కోట్లు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు వస్తే రాష్ట్రం ఇతర అవసరాలకు మల్లిస్తోందని విమర్శలు చేయటం సరికాదు. కేంద్రం నుంచి నిధులే రాకపోతే మల్లించటం ఎక్కడ ఉందని కెసిఆర్ ఎద్దేవా చేశారు. కొందరు శాసనసభ్యులు, విపక్ష నేతలు సమగ్ర వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమిలేదని  అసెంబ్లీ సాక్షిగా చెపుతున్న అని కెసిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు మాత్రమె వస్తున్నాయని తెలిపారు. సెంట్రల్ స్పాన్సర్ చేసే కొన్ని కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని సిఎం వివరించారు.

రాష్ట్రంలో చాలా మందికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని వారిని ఆదుకునేందుకు తొందరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ వెల్లడించారు. ఇలాంటి వారి కోసం సొంత ఇంటి నిర్మాణ పథకం తీసుకొచ్చే ఆలోచన ఉందని కెసిఆర్ చెప్పారు. నియోజకవర్గానికి 15 వందలు రెండు వేల మందికి లబ్ది చేకురేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే పథకం విధి విధానాలు ప్రకటిస్తామన్నారు.

హైదరాబాద్ కు గతంలో కేవలం మంజీర నుంచి మాత్రమే వచ్చేవి, తర్వాత కృష్ణ నుంచి కొన్ని ప్రాంతాలకు వచ్చేవి. కాంగ్రెస్ హయంలో నిర్వహణ సరిగా లేక తాగు నీరు ఇవ్వలేదు. కాంగ్రెస్ హయంలో విద్యుత్ పంపిణీ ఇందుకు నిదర్శనం అన్నారు. విధ్యుత్ కొరత తీర్చేందుకు సుమారు 20 వేల కోట్లు ఖర్చు చేశామని కెసిఆర్ చెప్పారు. త్వరలోనే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి అదునీకరణపై తొందరలోనే నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని సిఎం కెసిఆర్ చెప్పారు. డయాలిసిస్ సెంటర్లు గతంలో మూడు ఉండేవి ఇప్పుడు 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో అన్నింటా మెడికల్ కాలేజీలు తీసుకొస్తం.

15 లక్షల పైచిలుకు ఇతర రాష్ట్రాల కార్మికులు తెలంగాణలో పని చేసుకుంటున్నారు. తెలంగాణలో విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు ఉన్నాయి కనుకనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధికి వస్తున్నారని, గతంలో పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవి ఇప్పుడు కర్నూలు వారే గద్వాలకు వచ్చి పని చేస్తున్నారని తెలిపారు. నీటి యుద్దాలు జరిగే సమయంలో మహారాష్ట్రతో ఒప్పొండం చేసుకొని మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా మన రాష్ట్రాన్ని, మన సంస్కృతిని కించపరిచే విధంగా ఎవరు విమర్శలు చేసినా సహించేది లేదని కెసిఆర్ తెగేసి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్