Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం కెసిఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు

సిఎం కెసిఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసాభావన రాఖీ పండుగ లో ఇమిడి ఉన్నదని సిఎం కేసీఆర్ అన్నారు. సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సిఎం పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

రక్షా బంధన్ సందర్భంగా..శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ కు రాఖీ కట్టిన అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ  చెల్లెళ్ళు వినోదమ్మ. రాఖీలు కట్టిన సోదరీమణుల కాళ్ళు మొక్కి సిఎం కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్