CM tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో అయన పాల్గొంటారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 4నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరు సీతారామ రాజు 125వ జయంతి వేడుకలను మోడీ ప్రారంభిస్తారు. దీనితో స్కూళ్ళ ప్రారంభ తేదీని 4 నుంచి 5వ తేదీకి మార్చారు.
జగనన్న విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, లాంటి 9 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తూ వస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్ళు మొదలయ్యే జూలై 5నే వీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే సిఎం జగన్ ఆదోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాకానుక కింద వస్తువులను పంపిణీ చేయనున్నారు. ఆదోని లోని నెహ్రూ మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.