దేశంలో సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా.. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే పెంచాయి. ఈ మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. ఈ పెంపు ఈరోజు నుంచే అమల్లోకి రానుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
10 రోజుల కిందటే డొమెస్టిక్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు పెంచాయి. ఈ కారణంగానే ఇప్పుడు ధరలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది. కాగా కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, మెస్‌లలో రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.
Also Read : గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ