Saturday, January 18, 2025
HomeTrending NewsSatyagraha Deeksha : సత్యాగ్రహ దీక్షలతో కేంద్రానికి ఆల్టిమేటం

Satyagraha Deeksha : సత్యాగ్రహ దీక్షలతో కేంద్రానికి ఆల్టిమేటం

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపధ్ వెనక్కు తీసుకోవాలని లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో జరిగిన సత్యాగ్రహ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జై జవాన్, జై కిసాన్ నినాదం తో కాంగ్రెస్ పనిచేసింది ..మోడీ కి పోయే కాలం వచ్చింది కనుకనే అదానీ, అంబానీల కోసమే అగ్నిపథ్ తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసులే 9నెలలు శిక్షణ తీసుకుంటే.. ఆర్మీలకు 6నెలల శిక్షణ ఏ మాత్రం సరిపోతుందన్నారు. శత్రు దేశాలను ఏ విదంగా ఎదుర్కోగలం అన్నారు.

Satyagraha Diksha

నిరుపేద కుటుంబ పిల్లలే ఆర్మీ వైపు వస్తున్నారని, రెండేళ్ల క్రితం దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యారు. రాత పరీక్ష పెట్టకుండా రద్దుచేయడం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆర్మీ అభ్యర్థులపై రైల్వే కేసులతోపాటు, స్టేట్ పోలీసులు కూడా హత్యయత్నం కేసులు పెట్టారన్నారు. మోడీ ఎన్నికల హామీలపై.. అవినీతి అంశాలపై మోడీని నిలదీసే ప్రయత్నం చేస్తే.. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ నువ్వు మోడీ విధానాలపై క్లారిటీ ఇవ్వాలని, వచ్చే నెల 1, 2 తేదీల్లో నిరసన దీక్షలకు దిగు అని హితవు పలికారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్మీ అభ్యర్థులకు అండగా వుండాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఎలా పోరాటం చేశామో.. అలాగే అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Satyagraha Deeksha

మరోవైపు మధిర నియోజక వర్గ కేంద్రంలోని ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా జరిగిన సత్యాగ్రహ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యక్తులను భారత రక్షణ రంగంలో పంపటం కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్ని పద్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలవల్లే నిరుద్యోగులను ఆందోళన వైపు పురిగొల్పుతున్నాయని, రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగాలు ఇవ్వటం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో యువత హింస మార్గం వైపు మల్లుతున్నారని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రం జరిగిన సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువకుల జీవితాల్లో అగ్ని రాజేసిన సైనికనియామకం కోసం, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “అగ్నిపత్ ” ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అల్లర్లలో నిరుద్యోగులపై పెట్టిన అక్రమకేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశం కోసం సైనికులు తమ ప్రాణాలనే పణంగా పెట్టి కాపాడుతుంటే వారి నియామకాల్లో చిచ్చుపెట్టారని ఆరోపించారు.

 

కరీంనగర్ ధర్నా చౌక్ లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో మాజీ ఎంపి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ దేశరక్షణకోసం నియామకం చేసే సైనికుల విషయంలో కేంద్రం ముందే ప్రతిపక్షలతో చర్చించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకురావడానికి ఉద్దేశించిన అగ్నిపత్ ను వెంటనే ఉపసంహరించి, కేసులను ఎత్తివేయాలన్నారు. 50 మంది నిరుద్యోగులపై నాన్  బెయిలబుల్ కేసులు పెట్టడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్