తెలంగాణాలో వైఎస్ షర్మిల నెలకొల్పిన రాజకీయ పార్టీపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షర్మిల పార్టీకి నిర్మాత వైఎస్ జగన్ అయితే, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ కేసియార్ అని వ్యాఖ్యానించారు. జగన్, కేసియార్ ల అనుమతి లేకుండానే ఆమె తెలంగాణాలో తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. టి.ఆర్.ఎస్. వ్యతిరేకపార్టీల ఓట్లు చీల్చెందుకే ఆమె పార్టీపెట్టారని విమర్శించారు. సూది ఆంధ్ర ప్రదేశ్ లో పోగొట్టుకొని తెలంగాణలో వెదికితే ఏం లాభం అంటూ షర్మిలను నిలదీశారు.
జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేకశక్తులను ఏకంచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నారాయణ వెల్లడించారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కోవిడ్ వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు బాగుపడ్డాయని నారాయణ అన్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెట్టిందని నారాయణ విమర్శించారు.
ఫాదర్ స్టాన్ స్వామిధి ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని నారాయణ అన్నారు, అయన లాగే వరవర రావు, ప్రొ. సాయిబాబా లను కూడా చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.