Saturday, January 18, 2025
HomeTrending Newsమునుగోడులో కారుకే సీపీఏం మద్దతు

మునుగోడులో కారుకే సీపీఏం మద్దతు

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీనీ ఓడగోట్టడానికి టీఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మునుగోడులో తమకే సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలు కోరాయని, పార్టీ క్యాడర్ తో మాట్లాడి ఈ  నిర్ణయానికి వచ్చామని వివరించారు. హైదరాబాద్ సీపీఏం రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఏం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం…తెరాసకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పారు.

అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ చెప్పడం కేవలం సాకు మాత్రమేనని, రాజ్ గోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో అమిత్ షా క్లియర్ గా చెప్పారని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బిజెపి…  కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉండబోతోంది. దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మార్చబోతున్నారని పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుందని, రేవంత్ చాల కష్టపడుతున్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక పార్టీ స్పీడ్ అయిందని వివరించారు.

దేశంలో, రాష్ట్రంలో వామపక్షాలకు ప్రధాన శత్రువు బీజేపీ అని కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతుల వల్ల కొందరు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. అది చాల ప్రమాదమన్నారు. మునుగోడులో మాకు పట్టున్నా బీజేపీని ఓడగొట్టే శక్తి లేదని, మునుగోడు విషయంలో సీపీఏం లైన్ కి సీపీఐ లైన్ కి కొంత తేడా ఉందన్నారు. టీఆర్ఎస్ కి మా మద్దతు మునుగోడు వరకేనని, భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి మా మద్దతు ప్రస్తుతానికి కేవలం మునుగోడు వరకే అని స్పష్టం చేశారు.

బిజెపిని ఎదుర్కునేందుకు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసిపోదామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని తమ్మినేని అన్నారు. ఎన్నికల తర్వాత కూటమి కట్టడం ప్రాక్టికల్ గా సాధ్యమవుతుంది తప్పా ఇప్పుడే కూటమి కట్టడం సరైంది కాదని, మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పై మా పోరాటం ఆగదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ తో చర్చిస్తామని, కృష్ణయ్య హత్య విషయానికి మునుగోడులో టీఆర్ఎస్ మడ్డతుకి సంబంధం లేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాలని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Also Read : ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే జగదీష్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్