Friday, November 22, 2024
HomeTrending Newsనేడు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన దండోరా

నేడు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన దండోరా

హైదరాబాద్ గాంధీ భవన్ లో క్విట్ ఇండియా సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పతాకవిష్కరణ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి భారీ వాహన శ్రేణి తో ఇంద్రవెళ్లి కి పయనమైన రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ అధ్వర్యంలో నేడు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి తోపాటు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ లతో పాటు చైర్మన్ లు, పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, కార్య నిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొంటారు.

ఇంద్రవెల్లి సభ కోసం భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు, లక్ష మందితో భారీ బహిరంగ సభకు దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరాగా నామకరణం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న  దండోరా సభ. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దండోరా సభల నిర్వహణకు ఏర్పాట్లు. 17 పార్లమెంట్ నియోజక వర్గాలలో భారీ సభలు నిర్వహణ, సెప్టెంబర్ మొదటి వారంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్