Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: ఢిల్లీ విజయం, మరో మ్యాచ్ టై

ప్రొ కబడ్డీ: ఢిల్లీ విజయం, మరో మ్యాచ్ టై

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేటి మ్యాచ్ ల్లో ఢిల్లీ పాట్నాను ఓడించింది. గుజరాత్– ముంబై మధ్య జరిగిన మరో మ్యాచ్ టై అయ్యింది.

దబాంగ్ ఢిల్లీ – పాట్నా పైరేట్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 32-29తో ఢిల్లీ గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 19-10 తో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో పాట్నా పుంజుకుని ఆడి ఢిల్లీ ని నిలువరించే ప్రయత్నం చేసి 19-13 తో పైచేయి సాధించినప్పటికీ విజయం సాధించలేకపోయింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి ఢిల్లీ 3 పాయింట్లతో విజయం సాధించింది. ఢిల్లీ ఆటగాడు విజయ్ 9 పాయింట్లు సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

గుజరాత్ జెయింట్స్ – యూ ముంబా జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 24-24తో టై అయ్యింది. తొలి అర్ధభాగంలో గుజరాత్ 13-10తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలో ఇరు జట్లూ హోరా హరీ తలపడ్డాయి. విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. ముంబాయి 14-11 ఆధిక్యం ద్వితీయార్ధంలో  సాధించింది. దీనితో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (42 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (40); బెంగుళూరు బుల్స్ (39); యూపీ యోధ (33); జైపూర్ పింక్ పాంథర్స్ (31); యూ ముంబా (31); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్