Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 పై దేవి మ్యూజిక్ ట్యూన్.

పుష్ప 2 పై దేవి మ్యూజిక్ ట్యూన్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ‘పుష్ప‌’. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. పుష్ప నేష‌న‌ల్ వైడ్ కాకుండా ఇంటర్నేష‌న్ లెవ‌ల్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌డంతో ‘పుష్ప 2’ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని బన్నీ ఫ్యాన్స్, టాలీవుడ్ మాత్ర‌మే కాకుండా.. బాలీవుడ్ జ‌నాలు కూడా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా సుకుమార్ క‌థ‌ను రెడీ చేశార‌ని స‌మాచారం.

పుష్ప సినిమా అంత స‌క్సెస్ అవ్వ‌డానికి పాట‌లు కూడా ఓ కార‌ణం అని చెప్ప‌చ్చు. పుష్ప సినిమా కోసం రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ అందించిన పాటలు, ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. తాజాగా ఈ సినిమాను గురించి దేవిశ్రీ స్పందిస్తూ… పుష్ప 2 కోసం ఇంత వరకూ మూడు పాటలను ట్యూన్ చేశాను. ప్రతి పాట కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నారు.

అంతే కాకుండా…  సుకుమార్ కి ఈ ట్యూన్స్ విపరీతంగా నచ్చాయి. ఇక ఆయన స్క్రిప్ట్ లాక్ చేయడం జరిగిపోయింది. ఈ కథ ఎలా ఉంటుందనేది ఎవరూ గెస్ చేయలేరు అన్నారు. దేవిశ్రీ మాటలు ఈ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేశాయి. పాన్ ఇండియా స్థాయిని పుష్ప టచ్ చేయడం వలన, అదే రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్స్ ను తీసుకుంటున్నారు. సమంత కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మ‌రి.. పుష్ప 2 ఎలాంటి రికార్డుల‌ను సెట్ చేస్తుందో చూడాలి.

Also Read :  ‘పుష్ప 2’ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్