Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్, యువీ మధ్య విబేధాల..?

ప్రభాస్, యువీ మధ్య విబేధాల..?

ప్రభాస్ సంస్థ అంటే.. యు.వీ క్రియేషన్సే. తన స్నేహితులో కలిసి నిర్మించిన సంస్థ ఇదని అందరికీ తెలిసిందే. మిర్చి సినిమా నుంచి ప్రభాస్ ఈ సంస్థను తన ప్రతి సినిమాలో ఏదో భాగంగా ఇన్ వాల్వ్ చేస్తున్నారు. అయితే.. ఈ సంస్థ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో భారీగా నష్టాలు వచ్చాయని టాక్ వినిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అలా నెట్టుకొస్తుంది. భారీ పాన్ ఇండియా సినిమాలతో పాటు వరుసగా చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుండేది కానీ.. ఇప్పుడు ఈ సంస్థలో జోష్ తగ్గింది. ఈ సంస్థ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రిలీజ్ కావాల్సివుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ ఈ సంస్థను కాస్త పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. మేటర్ ఏంటంటే.. ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులను యు.వీ క్రియేషన్స్ దక్కించుకున్నట్లుగా టాక్ వచ్చింది. దాదాపు 100 కోట్ల డీల్ సెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు వారిని తప్పించి ప్రభాస్ పీపుల్ మీడియా ప్యాక్టరీ వాళ్లకి ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులను ఇచ్చాడని తెలిసింది. దాదాపు 185 కోట్ల రేంజ్ లో ఈ హక్కులు అమ్ముడు కోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతితో సినిమా చేస్తున్నాడు.

మరో విషయం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో కూడా యు.వీ.క్రియేషన్స్ ను పక్కనపెట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నిర్మాణ భాగస్వామిగా అవకాశం ఇచ్చాడని తెలిసింది. మొత్తానికి ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మధ్య బాండింగ్ బాగా పెరిగింది. ప్రభాస్ తో అంతే.. ఒక్కసారి కనెక్ట్ అయితే ఇలాగే ఉంటుంది. అయితే… ప్రభాస్ ఇలా యువీని పక్కనపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సంస్థతో విభేదాలు వచ్చాయా అనే అనుమానాలు వస్తున్నాయి కానీ.. అలాంటిది ఏమీ లేదని అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి యు.వీ బ్యానర్ లో ఏదో జరుగుతుంది అనే టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్