క్రియేటీవ్ డైరెక్టర్ అనగానే ఠక్కున కృష్ణవంశీ గుర్తొస్తారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు అందించారు. అన్నింటికి మించి మంచి సినిమాలను అందించారు. తాజాగా కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించారు. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న రంగమార్తాండ చిత్రం ఎట్టకేలకు ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అయితే.. రంగమార్తాండ మంచి సినిమా అనే టాక్ తెచ్చుకోవడంతో కృష్ణవంశీ నెక్ట్స్ మూవీ పై పోకస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణవంశీ అన్నం, ‘రైతు’ అనే రెండు సినిమాలు చేయాలి అనుకున్నారు. రైతు చిత్రాన్ని బాలకృష్ణతో చేయాలి అనుకున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ తో చేయించాలి అనుకున్నారు. అమితాబ్ ని కలిసి కృష్ణవంశీ కథ చెప్పడం జరిగింది కానీ.. ఎందుకనే ఆయన ఆ పాత్రను చేయడానికి ఇష్టపడలేదు. అమితాబ్ నటిస్తేనే.. ఈ సినిమా చేస్తానని బాలయ్య కండిషన్ పెట్టారు. దీంతో రైతు ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు రైతు చిత్రాన్ని చేయాలి అనుకుంటున్నారట కృష్ణవంశీ. అయితే.. బాలయ్యతో కాకుండా వేరే హీరోతో రైతు చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యారట. రంగగమార్తాండ నిర్మాత మధునే రైతు సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. రైతు సినిమా తప్పకుండా కృష్ణ వంశీ మార్కు మూవీగా ఉంటుందని.. ఆ కథ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయితే.. కృష్ణ వంశీ రైతు ఎవరితో చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. రైతు సినిమాతో పాటుగా ‘అన్నం’ అనే సినిమాను కూడా కృష్ణవంశీ నెక్స్ట్ ప్లానింగ్ లో ఉంది. మరి.. రైతు, అన్నం ఈ రెండు చిత్రాలను ఎవరితో చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.