Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్..?

పవన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్..?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేని పరిస్థితి. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని పవర్ స్టార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అనుకున్నారు. అదే ‘గేమ్ ఛేంజర్’. ఇదే విషయాన్ని శంకర్ దిల్ రాజుతో చెబితే.. పవన్ కళ్యాణ్ తో కాదు… ఈ చిత్రాన్ని చరణ్ తో చేద్దామని అనడంతో ఓకే అన్నారు. ఈ విధంగా చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చింది.

అయితే… పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని శంకర్ మరో స్టోరీ రెడీ చేయిస్తున్నారట. స్టోరీ లైన్ ను తన రైటర్స్ టీమ్ కి చెప్పి ఫుల్ స్టోరీగా రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం శంకర్ రైటర్స్ టీమ్ అదే పనిలో ఉన్నారని తెలిసింది. గేమ్ ఛేంజర్ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అప్పటికి ‘ఇండియన్ 2’ కూడా కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత పవన్ తో మూవీ చేయాలి అనేది శంకర్ ప్లాన్. అంతా బాగానే ఉంది కానీ.. శంకర్ తో సినిమా అంటే.. చాలా ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాలి కానీ.. పవన్ ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.

అందుచేత పవన్ – శంకర్ ప్రాజెక్ట్ గురించి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది జరిగేపనేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శంకర్ మాత్రం పవర్ స్టార్ రేంజ్ ఏంటో బాగా తెలుసు కాబట్టి ఆయనతో వర్క్ చేయాలి అనుకుంటున్నారట. పవన్ ఒప్పుకున్న సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయనతో సినిమా చేయాలనేది ప్లాన్. దీనికి దిల్ రాజు కూడా తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పారని టాక్ వినిపిస్తుంది. మరి.. పవన్, శంకర్ ప్రాజెక్ట్ వార్తలకే పరిమితం అవుతుందో.. నిజంగా నిజం అవుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్