Tuesday, March 19, 2024
HomeTrending NewsChandrababu: డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బాబు

Chandrababu: డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బాబు

జగన్ పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందని, డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ హయాంలో బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే నేడు ఐటి రంగంలో పురుషులకంటే మహిళలే ఎక్కువ జీతం సంపాదిస్తున్నారని చెప్పారు. తాము చేపట్టిన ఎన్నో పథకాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఐదు లక్షల రూపాయల వరకూ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ కల్పించేలా కృషి చేశామని, కానీ ఈ ప్రభుత్వం వారిని కేవలం బహిరంగ సభలకు పిలిపించేందుకే పరిమితం చేసిందని, ఈ మూడున్నరేళ్లలో వారికోసం ఒక్కరోజూ ఆలోచించలేదని విమర్శించారు. ఇదేం ఖర్మ  మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మహిళా సంఘాలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

అభయ హస్తం, స్త్రీ నిధి పథకాలను నిలిపి వేశారని… మహిళా స్వయం సాధికారత కోసం తాము సంఘాలు ఏర్పాటు చేశామని, ఆ స్పూర్తిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. సిఎం సభలకు వస్తున్న మహిళలను అవమానిస్తున్నారని, నల్ల బ్యాగులు, చున్నీలు, గొడుగులను కూడా లాక్కుని సభాలోపలికి పంపే దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ ప్రభుత్వం వల్ల ఎంత లబ్ధి చేకూరిందీ, ఖర్చులు ఎంత పెరిగాయన్నది ప్రతి మహిళా బేరీజు వేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దిశ చట్టం  తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ అసలు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని బాబు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో డ్వాక్రా సంఘాలు ముందుకు రావాలని, మహిళా శక్తి ఏమిటో నిరూపించాలైన సమయం ఆసన్నమైందని బాబు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్