Tragedy: శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న ఆటోకు హై టెన్షన్ విద్యుత్ వైర్ తాకి ఆటో దగ్ధమైంది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. వీరంతా సమీపంలోని గుడ్డం పల్లి వాసులుగా గుర్తించారు.
విదేశీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి పరిస్థితిని అడిగి తెసులుకున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు,
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 30, 2022