Wednesday, February 26, 2025
Homeస్పోర్ట్స్ENG Vs. AUS: ఇంగ్లాండ్ నిలిచేనా?

ENG Vs. AUS: ఇంగ్లాండ్ నిలిచేనా?

యాషెష్ సిరీస్-2023 తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యంలో ఉంది.  తొలి టెస్టులో 8 వికెట్లు కోల్పోయి 393 పరుగులకు డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్…. ఆసీస్ ను 386 పరుగులకే ఆలౌట్ చేసింది. ఉస్మాన్ ఖవాజా-141; అలెక్స్ క్యారీ-141; ట్రావిస్ హెడ్-50; కామెరూన్ గ్రీన్-38; కెప్టెన్ కమ్మిన్స్-38 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ బ్రాడ్, రాబిన్సన్ చెరో 3; మోయిన్ అలీ 2; జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.

నేడు మూడో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసిం  ప్రస్తుతానికి  35 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నేడు వర్షం కారణంగా ఆటకు మధ్యలో కాసేపు అంతరాయం కలిగింది.

ఇంగ్లాండ్ టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ ఆటగాళ్ళు క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు చేస్తేనే ఆసీస్ ను ఓడించడం సాధ్యం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్