Ashes Series – Sydney Test: సిడ్నీ టెస్టులో ఇంగ్లాండ్ ముందు 388 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్లేమీ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. అంతకుముందు ఏడు వికెట్లకు 258 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో నేటి నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 294 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న సెంచరీ (103)తో అజేయంగా ఉన్న బెయిర్ స్టో-113 పరుగులు చేసి ఔటయ్యాడు, జాక్ లీచ్-10, జాక్ లీచ్-15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ నాలుగు; కమ్మిన్స్, లియాన్ చెరో రెండు; స్టార్క్, గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.
122 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఉస్మాన్ ఖవాజా, గ్రీన్ రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో 113 చేసిన ఖవాజా రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ (101) సాధించి అజేయంగా నిలిచాడు. గ్రీన్ 74; లాబుస్ చేంజ్-29; స్టీవ్ స్మిత్-23; మార్కస్ హారిస్-27 పరుగులు చేశారు. ఆరు వికెట్లకు 265 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మొత్తంగా ఇంగ్లాండ్ ముందు 388 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, మార్క్ వుడ్ 2వికెట్లు తీసుకున్నారు.
ఇంగ్లాండ్ విజయానికి చివరి రోజు 358 పరుగులు చేయాల్సి ఉంది. హసీబ్ హమీద్ -8, జాక్ క్రాలే -22 పరుగులతోను క్రీజులో ఉన్నారు.
Also Read : యాషెస్ నాలుగో టెస్ట్ : ఇంగ్లాండ్ 258/7