కెసిఆర్ ను ఓడగొట్టక పోతే నా జీవితానికి సార్ధకత లేనట్టేనని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కెసిఆర్ దృష్టిలో బానిసలు లీడర్ లు… ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు కాదన్నారు. హైదరబాద్ బిజెపి కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ .. 2018 ఎనికల్లో తనను ఓడించే ప్రయత్నం చేశారని సిఎం కెసిఆర్ పై ఆరోపణలు చేశారు. తనతో పాటు మహబూబ్ నగర్ లో ఒకరిని, ఖమ్మం లో ఒకరిని, కరీం నగర్ లో నాతో పాటు మరొకరిని ఓడగొట్టే ప్రయత్నం చేశారన్నారు.
తాను ఉద్యమంలో పని చేయలేదా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఈటెల కుట్ర పూరితంగా పార్టీ నుంచి బయటకు పంపించారని ధ్వజమెత్తారు. తాను ఏం తప్పు చేశానని మంత్రివర్గం నుంచి తప్పించారో కెసిఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎం తన సవాల్ నీ స్వీకరించక తన బానిసల తో ప్రెస్ మీట్ లు పెట్టించి తిట్టిస్తున్నాడన్నారు. ఈ రోజు మాట్లాడుతున్న అయన బానిసలు ఒక్కసారి తమ గతం గురించి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలన్నారు. చెన్నూరు ఎమ్మేల్యే కు మనసు గాయపర్చడం తప్ప అయన జాతి కోసం మాట్లాడినది లేదని విమర్శించారు.
బెయిల్ ఆలస్యం అయితే కెసిఆర్ నీ బూతులు తిట్టిన వ్యక్తి అయన..ఆయనకు నేనే బెయిల్ తెచ్చిన వ్యక్తినని ఈటెల గుర్తు చేశారు. ఇంకొక అయన టికెట్ ఇస్తే ఓడి పోయి TRS తిట్టిన వ్యక్తి అన్నారు. తాను వార్డ్ మెంబర్ గా సర్పంచ్ గా పోటీ చేయలేదని, ఎమ్మేల్యే అయ్యేందుకు TRS పార్టీ లోకి రాలేదని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
Also Read : కెసిఆర్ అనాలోచిత విధానాలు – ఈటెల