Saturday, January 18, 2025
Homeసినిమాతుపాను వస్తుందని తెలిసినా ఆగలేదు: అశ్వనీదత్

తుపాను వస్తుందని తెలిసినా ఆగలేదు: అశ్వనీదత్

టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతగా అశ్వనీదత్ కి మంచి పేరుంది. సీనియర్ ఎన్టీఆర్ మొదలు అందరు స్టార్ హీరోలతో ఆయన సినిమాలను నిర్మించారు. వైజయంతి మూవీస్ అనగానే ఆ బ్యానర్ లో మంచి విషయమున్న  సినిమాలే వస్తాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ బ్యానర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1990లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు  ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సినిమాను గురించిన విషయాలను ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అశ్వనీదత్ ప్రస్తావించారు.

“మొదటి నుంచి కూడా నేను జాతకాలను ఎక్కువగా నమ్మేవాడిని. అందువలన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాను విడుదల చేయడానికి ముందు శర్మగారిని కలిశాను. ఆయన జాతకాలు బాగా చెప్పేవారు. ఆయనను కలిసి మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల  చేయాలనుకుంటున్నట్టుగా చెప్పాను. ఆ రోజున విడుదల చేయమనీ .. కాకపోతే ఆంధ్రలో తుఫాను వస్తుందని అన్నారు. తుఫానుతో పాటు ఆ సినిమాకి  ధనం కూడా వస్తుందని చెప్పారు. దాంతో నేను రెండో ఆలోచన చేయకుండా ఆ సినిమాను అదే రోజున రిలీజ్ చేశాను.

శాస్త్రిగారు చెప్పినట్టుగానే భయంకరమైన తుఫాను వచ్చింది. అయినా సినిమాకి వచ్చేవారు ఆగలేదు. ఆయన చెప్పినట్టుగానే ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా వలన మా బ్యానర్ ప్రతిష్ఠ మరింత పెరిగింది. తుఫాను సమయంలో నేను .. రాఘవేంద్రరావు టెన్షన్ పడ్డాము. పరిస్థితి ఎలా ఉందో చూద్దామని విజయవాడ వెళ్లాము. కొన్ని థియేటర్లు నీళ్లలో ఉన్నప్పటికీ జనం ఆగడం లేదు .. అలా హాల్స్ ఫుల్ అవుతుండటం చూసి అప్పుడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాము” అని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్