పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో ఈ ఉదయం  నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.  ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. అదృష్ట వశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.

నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు.  అంతా సురక్షితంగా బయటపడడంతో.. అటు భక్తులు, అధికారులు  ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *