Sunday, February 23, 2025
HomeTrending Newsచెన్నై కు నారాయణ!

చెన్నై కు నారాయణ!

Narayana free: పదో తరగతి ప్రశానాపత్రాల లీకేజీ కేసులో నిన్న అరెస్టయిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు  నేటి తెల్లవారుజామున బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా మేజిస్ట్రేట్ సులోచనారాణి తీర్పు చెప్పారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుతో నారాయణకు బెయిల్ మంజూరు చేసిన మేజిస్ట్రేట్

2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేశారని అయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చి దానికి సంబంధించిన పత్రాలు సమర్పించారు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం  బెయిల్ మంజూరు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.

బెయిల్ పత్రాలు అందగానే నారాయణను పోలీసులు విడుదల చేశారు. వెంటనే ఆయన చెన్నైకు వెళ్ళారు. బెయిల్ రాగానే ఆయన నెల్లూరు వస్తారని వార్తలు వచ్చాయి. అయితే అమరావతి రీజినల్ రింగ్ రోడ్ కేసులో ఆయన్ను మళ్ళీ అదుపులోకి తీసుకోవచ్చేనే వార్తల నేపథ్యంలో అయన చెన్నైకు వెళ్ళినట్లు సమాచారం.

Also Read :  ఏపీ సిఐడి అదుపులో నారాయణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్