Sunday, January 19, 2025
HomeTrending Newsఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు: గుడివాడ

ఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు: గుడివాడ

గ్లోబల్  ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఇప్పటివరకూ విపక్షాలు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగామని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, యువతకు ఉపాధి అవకాశాలకల్పనకు ఈ సదస్సు ఎంతో దోహదం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 352 ఎంవోయూలు కుడురుచుకున్నామని, వీటి ద్వారా శుమాలు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

గత మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమల్లో 89శాతం గ్రౌండింగ్ స్థాయికి  తీసుకు వెళ్లామని, ఇప్పుడు కూడా ఎంవోయూ చేసుకున్న కంపెనీలు తమ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరులు, సహజ వనరులు ఏమిటో చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని, దానికి కూడా ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని చెప్పారు. దేశం మొత్తంలో 11ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తుంటే వాటిలో 3 మన రాష్ట్రం మీదుగా వస్తున్నాయన్నారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోటీపడగల ఏకైక నగరం విశాఖ మాత్రమేనని, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో ఈ నగరం కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి స్పష్టం చేశారు.   ఎగుమతుల రంగంలో ఏపీ కీలకపాత్ర పోషిస్తోందని… ఔషధాలు, మెరైన్, చేపలు, ఖనిజాలు, కోకోవా, మ్యాంగో పల్ప్, పాపయా, ఫైనాపిల్ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా ఎక్కువగా ఉందని తెలిపారు.

ఈ సదస్సు ద్వారా విశాఖకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడిందని, ఇక్కడి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, మౌలిక వసతులు.. అన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిశాయని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విశాఖ దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడగలుగుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

Also Read : ఒప్పందాలు త్వరలోనే గ్రౌండింగ్ కు..: సిఎం ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్