Sunday, January 19, 2025
HomeTrending Newsగోదావరి వద్ద మరింత పెరిగిన ఉధృతి

గోదావరి వద్ద మరింత పెరిగిన ఉధృతి

Heavy In-out Flow: ధవళేశ్వరం వద్ద గోదావరి నదీ ప్రవాహ ఉధృతి మరింతగా పెరుతుతోంది. గోదావరి నీటిమట్టం 18 అడుగులకు చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 20.37 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ ఎండి  అంబేద్కర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. కంట్రోల్ రూమ్ నుంచి వరద పరిస్థితిని విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశామని, ఇప్పటికే ఈ బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వివరించారు.

వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని, ఇదే జరిగితే 6 జిల్లాల్లో 44 మండలాల్లోని 628 గ్రామలపై ప్రభావం ఉంటుందని అయన వెల్లడించారు.  వరద ఉధృతి దృష్ట్యా ముందస్తుగా అదనపు సహాయక బృందాలను రంగంలోకి దించామని, ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని అంబేద్కర్ చెప్పారు.

Also Read : ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్