హనుకొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై కు మరోసారి అవమానం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో తమిళిసై పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్ కు స్వాగతం పలికేందేకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. దీంతో కేయూ గెస్ట్ హౌజ్ దగ్గర RDO వాసుచంద్ర, డీసీపీ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ 56 మందికి PHD పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన గవర్నర్ ..విద్యార్థులు క్రియేటివ్ గా ఆలోచించాలన్నారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు పోవాలన్నారు. ఆన్ రైడ్ ను పక్కకు పెట్టి.. ప్రకృతిని ఆస్వాదించాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పారు. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నారు. మహిళలు సాధారణ కోర్సులు కాకుండా.. వృత్తి పరమైన మెడికల్ కోర్సుల విద్యను అభ్యసించాలన్నారు.
ప్రోటోకాల్ పై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ తన ప్రోటోకాల్ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు కదా అని జర్నలిస్టులతో అన్నారు. హైదరాబాద్ లో పరిస్థితి అంతా కంట్రోల్ లోనే ఉందని వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్ళినప్పుడు సంజయ్ కిరణ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నానని, ఆయన సోదరుడు ఉదయ్ కిరణ్ ధైర్యంతో ఉండాలి,కుటుంబానికి అండగా ఉండాలని గవర్నర్ అన్నారు. స్టూడెంట్స్ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. స్టూడెంట్స్ ఛాలెంజెస్ ను ఎదుర్కొని నిలబడాలని కోరారు. ప్రభుత్వం ఇంకా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కరోనా తరువాత చాలా మంది డిప్రెషెన్ లోకి వెళ్తున్నారని గవర్నర్ అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, మెడికల్ సౌకర్యాలు మెరుగు పర్చాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థి ఆత్మహత్య లాంటి ఘటనలు జరగడం చాలా బాధాకారమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి