Sunday, January 19, 2025
Homeసినిమా'వీరమల్లు' ఇప్పటికీ అదే అయోమయం!

‘వీరమల్లు’ ఇప్పటికీ అదే అయోమయం!

పవన్ కల్యాణ్ తొలి చారిత్రక చిత్రంగా ‘హరిహర వీరమల్లు‘ రూపొందుతుందనగానే ఆయన అభిమానులంతా చాలా ఉత్సాహ పడిపోయారు. ఈ సినిమాలో పవన్ గజదొంగ పాత్రలో కనిపించనున్నాడనీ, చేజింగ్స్ .. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే అప్ డేట్స్ రావడంతో అందరిలో మరింత కుతూహలం పెరిగిపోయింది. చారిత్రక కట్టడాలకి సంబధించిన సెట్స్ చూసి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు.

ఎ. ఎమ్. రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. 50 శాతం వరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఆ మధ్య కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత కూడా ఈ సినిమా సెట్స్ పై పవన్ అప్పుడప్పుడు మాత్రమే కనిపించారు. పవన్ మళ్లీ షూటింగుకి వచ్చారు .. ఇక నాన్ స్టాప్ గా షూటింగు జరుగుతుందని అభిమానులు అనుకునే లోగానే మళ్లీ గ్యాప్ రావడం జరుగుతూ వచ్చింది.

ఇక ఆ సినిమా అలా సెట్స్ పై ఉండగానే హరీశ్ శంకర్ సినిమా అప్ డేట్ లో పవన్ సందడి చేశాడు. ఆ సినిమా షూటింగు మొదలవుతుందని భావిస్తే, అది కూడా అక్కడే ఆగిపోయింది. ఇటీవల సముద్రఖని దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్టులోను పవన్ కనిపించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైందనే ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సగం షూటింగును పూర్తి చేసుకున్న ‘వీరమల్లు’ విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందనే అయోమయం అలాగే ఉంటోంది. ఈ విషయంలో క్రిష్ .. రత్నం కూడా సైలెంట్ గా ఉండటం మరింత అయోమయాన్ని కలిగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్