Saturday, January 18, 2025
Homeసినిమామెగా హీరోతో హరీష్ శంకర్ మూవీ..?

మెగా హీరోతో హరీష్ శంకర్ మూవీ..?

పవన్ కళ్యాణ్‌, ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రానుందని కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రకటించింది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఈ మూవీకి డేట్స్ ఇవ్వలేదు. దీంతో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ అసలు ఉందా..?  లేదా అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి.

పవన్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు యాభైశాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే… ఈ మూవీకి పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో..? ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఈ చిత్రం కంటే ముందు మరో సినిమా చేయాలని హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యారట. ఎవరితో సినిమా చేయనున్నాడంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ తో అని టాక్ వినిపిస్తోంది.

వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ ఓ కథ చెప్పాడని, వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని బండ్ల గణేశ్ నిర్మిస్తున్నారని, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గతంలో వరుణ్ తో హరీష్ శంకర్ ‘గద్దలకొండ గణేష్’ అనే హిట్ మూవీ తీసారు. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు వరుణ్ తేజ్ కు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు వరుణ్ కోసం  హరీష్ శంకర్ లాంటి కథ రాశాడు అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్