Thursday, February 22, 2024
HomeTrending Newsశర్వానంద్ కారుకు ప్రమాదం

శర్వానంద్ కారుకు ప్రమాదం

జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లో  హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది.  ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. హీరో  శర్వానంద్ కు కూడా స్వల్పంగా గాయాలైనట్లు తెలిసింది, అయితే ఈ విషయాన్ని శర్వానంద్ టీమ్ ధృవీకరించలేదు.  ర్వానంద్ రేంజ్ రోవర్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

హీరో శర్వానంద్‌ వివాహం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితతో జూన్ 3న రాజస్థాన్, జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ లో జరగనుంది.  మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది. అదే రోజు శర్వానంద్‌, రక్షితాల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది.

వచ్చే వారం వివాహం ఉండడంతో ఈ ప్రమాద ఘటనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్