Sunday, January 19, 2025
Homeసినిమాకొత్త ప్రాజెక్టుల కోసం క్రేజీ భామల వెయిటింగ్!

కొత్త ప్రాజెక్టుల కోసం క్రేజీ భామల వెయిటింగ్!

Heroines in waiting: తెరపై కథానాయికగా కనిపించాలంటే అందం ఉండాలి .. అభినయం ఉండాలి. ఈ రెండింటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ మూడు ఉంటే అవకాశాలు వరుసబెట్టి వచ్చేస్తాయని చెప్పలేం .. ఎందుకంటే అవకాశాలను అందుకోవాలంటే కాస్తంత లౌక్యం కూడా కావాలి. వీటిలో ఏది కాస్త లోపించినా రేసులో వెనకబడిపోవడం సహజంగానే జరిగిపోతుంటుంది. కొంతమంది కథానాయికలు మంచి క్రేజ్ వచ్చిన తరువాత కూడా వెనకబడిపోవడానికి కారణం వీటిలో ఏదో ఒకటి అయ్యుంటుందని అనుకోవచ్చు.

నివేదా థామస్ విషయానికి వస్తే కెరియర్ ఆరంభంలోనే వరుస హిట్లు కొట్టేసింది. ఎక్స్ పోజింగ్ అనేది లేకుండా రాకెట్ లా దూసుకుపోయింది. ‘నిన్ను కోరి’ .. ‘118’ .. ‘బ్రోచేవారెవరురా’ వంటి డిఫరెంట్ మూవీస్ తో సక్సెస్ లను తన హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకుంది. కానీ ఆ తరువాత హఠాత్తుగా ఆమె గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. ఇక నభా నటేశ్ ఎక్స్ పోజింగ్ కి వెనకాడకపోయినా నిలబడలేకపోతోంది. ‘ఇస్మార్ శంకర్’ తరువాత మరో హిట్ లేకపోవడంతో ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా వెయిట్ చేస్తోంది.

ఇక ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో పరిచయమైన ‘ప్రియాంక అరుళ్ మోహన్‘ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. శర్వానంద్ తో చేసిన ‘శ్రీకారం’ ఫ్లాప్ అయిన తరువాత టాలీవుడ్లో మళ్లీ ఆమె పేరు వినిపించడం లేదు. ఇటీవలే తమిళంలో ‘డాక్టర్’ సినిమాతో హిట్ కొట్టిన ఆమె, ‘డాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. అలాగే టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తాయేమోనని ఎదురుచూస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ .. మేఘ ఆకాశ్ కూడా ఇంకా అవకాశాల కోసం సతమతమవుతూనే ఉన్నారు. వీళ్ల గ్రాఫ్ కి ఊతాన్నిచ్చే సినిమాలేవైనా పడతాయేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్