Friday, September 20, 2024
HomeTrending NewsTransco: విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - మంత్రి జగదీష్ రెడ్డి

Transco: విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి – మంత్రి జగదీష్ రెడ్డి

వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రంలో మెయింటెన్స్ ఆఫ్ సప్లై గురుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతటి భారీ వర్షాలు సంభవించినా సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని సూచించారు.విద్యుత్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడడంతో పాటు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా ఆదేశించాలని ఆయన చెప్పారు. బ్రేక్ డౌన్ ఆయిన పక్షంలో అత్యవసరంగా రిస్టోర్ కు అవసరమైన సిబ్బందిని, మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి అంతరాయం కలుగ కుండా అన్ని చర్యలను తక్షణం చేపట్టాలని ఆయన ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్