Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

How do web series impact our everyday’s life?

పాత సినిమాలు
మంచిని గొప్పగా చూపేవి . ఎక్కువ సీన్ లు మంచిని గొప్పగా చూపించడం కోసం కేటాయించేవారు . చెడును తక్కువ సీన్ లలో, అందరికీ అసహ్యం, కోపం కలిగేలా చూపేవారు. సినిమా ఒక మోరల్ లెసన్.

కొత్త సినిమాలు
చెడును ఎక్కువ సీన్ ల లో చూపుతారు. గ్లోరిఫై చేస్తారు. కానీ చివరకు మంచికే విజయం అని చూపుతారు .

టీవీ సీరియల్స్
చెడును అదేపనిగా గంటల కొద్దీ రోజులు వారాలు, నెలలు కొద్దీ చూపుతారు . కానీ చివరకు చెడు ఇది మంచి, ఇది అని చూపి ముగిస్తారు.

పై మూడింటిలో మంచి విజయం సాధిస్తుంది. కొత్త సినిమాలు, టీవీ సీరియల్స్ చెడును అతిగా చూపినా, చివరకు మంచి విజయం సాధిస్తుంది అనే ముగింపు వల్ల సమాజానికి కలిగే నష్టం తక్కువే.

వెబ్ సిరీస్
ఇది టీవీ సీరియళ్లకు ఎక్కువ …పోర్న్ ఫిలిమ్స్ కు తక్కువ. పోర్న్ ఫిలిమ్స్, వయొలెంట్ వీడియో గేమ్స్ కంటే అనేక రెట్లు సమాజానికి కీడు చేస్తున్నాయి. తెలుగులో వెబ్ సిరీస్ తక్కువ. హిందీ వాటిలా అంతగా హిట్ కాలేదు. కాబట్టి హిందీ రాని తెలుగు వారికి దీని గురించి అంతగా తెలియదు.

పోర్న్ ఫిలిమ్స్ లో ఫోకస్ అంతా దృశ్యాలపై ఉంటుంది. వీటిని చూసేది ఎక్కువగా పురుషులు. వెబ్ సీరియల్స్ ను చూసే వారిలో మూడింట రెండు వంతులు స్త్రీలే .

నలబై దాటిన స్రీలు టీవీ సీరియల్స్ కు అడిక్ట్ అయ్యారు . హాస్టల్లో వున్న అమ్మాయిలు, నలబై లోపు మహిళలు వెబ్ సిరీస్ కు అడిక్ట్ అవుతున్నారు .

వెబ్ సిరీస్ లో పోర్న్ ఫిలిమ్స్ లాగా పూర్తి స్థాయి నగ్న దృశ్యాలు వుండవు. మోరల్ కరప్షన్ … ప్రజల ఆలోచన విధానాన్ని మార్చి చెడగొట్టే దిశగా అధిక శాతం వెబ్ సిరీస్ ఉంటున్నాయి.

“అసలు మంచి ఏంటి? చెడు ఏంటి? దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? సోది కాకపోతే?” … ఎస్… ఈ కోణం నుంచే వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. దాని ఎటాక్ పాయింట్ అదే.

Are Web Series Deteriorating The Youth Mentality

వీటిలో రొటీన్ కథలు వుండవు. ఇవే నవీన సమాజపు కొత్త పోకడలు అంటూ, వివిధ సబ్జక్ట్స్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తారు. హిందీలో బాగా హిట్ అయిన వెబ్ సిరీస్ లలో తీసుకొన్న అంశాలు.

1 . డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ తీసుకోవడం… ముఖ్యంగా అమ్మాయిలు వీటిని చాలా రొటీన్ గా తీసుకొంటూ వుంటారు.

2 . లవ్, వివాహపూర్వ లైంగిక సంబంధాలు, డేటింగ్, క్యాజువల్ సెక్స్, గ్రూప్ సెక్స్.

3 . లెస్బియన్ సంబంధాలు, గే సెక్స్ ..

4 . వివాహేతర లైంగిక సంబంధాలు. పెద్ద మహిళ { బాబీ అంటారు } యువకులకు ఆకర్షితులు కావడం… వయసులో పెద్ద వాడు యువతులకు గాలెం వెయ్యడం…

5 . వావివరసలు లేని సెక్స్ … టీచర్ – స్టూడెంట్; స్టెప్ ఫాదర్ – స్టెప్ డాటర్; స్టెప్ మదర్ – స్టెప్ సన్, బ్రదర్ – సిస్టర్ ఇలా…

ఇవన్నీ పోర్న్ ఫిలిమ్స్ లో ఎంతో కాలంగా వున్న సబ్జెక్స్ లే కదా అని ఎవరైనా అనొచ్చు… వెబ్ సిరీస్ చేస్తున్న చెడు దాని వల్ల కలిగే విధ్వంసం అపారం. ఎలాగో చూద్దాము.

వెబ్ సిరీస్ కంపెనీలకు సీఈఓలు గా ఐఐఎం లాంటి ఉన్నత విద్యాసంస్థల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువతుల్ని నియమిస్తున్నారు . వీరు తమ తెలివి మొత్తాన్ని వుపయోగించి ఈ కాలం యువతను ముఖ్యంగా యంగ్ లేడీస్ ను ఆకట్టుకొనే లా ఈ సీరియల్స్ ను తీస్తున్నారు . ఇందులో సీన్స్ అంతకంటే మించి డైలాగులు బ్రెయిన్ వాష్ చేసేలా చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి .

ఉదారణకు నలుగురు అమ్మాయిలు ఒక చోట వుంటారు. ఒక అమ్మాయి వోడ్కా తెస్తుంది. మిగతా వారిని తాగడానికి పిలుస్తుంది. వారు” తప్పు కదా?” అంటారు. “ఏది తప్పు? … ఇది పురుషాధిక్య భావన! . మహిళలను కట్టి పడెయ్యడానికి పురుషుడు విధించిన రూల్! . శతాబ్దాలుగా మహిళ దీన్ని భరిస్తూ వస్తోంది. ఇంత చదువుకొన్నాము … ఇప్పటికైనా పురుషాధిక్యతను బ్రేక్ చేయలేమా?” అంటుంది. ఈ డైలాగులు మామూలు వారిని పూర్తిగా కన్విన్సు చేసేస్తాయి. తాగడం తప్పు కాదు.అదొక ట్రెండ్ అనే భావన చూసే వారిలో వస్తుంది. అటు పై సన్నివేశాల్లో సిగరెట్… “తప్పేముంది? అనుభవించడానికే కదా జీవితం? ఈ వయసులో కాకపోతే ఆంటీ అయ్యాక ఎంజాయ్ చేస్తావా?” అంటూ ప్రేరణ .

” అబ్బాయిల ప్రేమ మొత్తం అబద్ధమే… నీ శరీరాన్ని దోచుకోవడానికే నీ వెంట పడుతాడు. అసలు అమ్మాయి మనసును అర్థం చేసుకొన్న అబ్బాయి ఎవరు?” అంటూ ఆ అమ్మాయి తన స్నేహితురాలికి బౌతికంగా దగ్గర కావడానికి ప్రయత్నింస్తుంది.

“తప్పు కదా?” అంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్లి ఓదార్పు . లెస్బియనిజంను జస్టిఫై చేసేలా పదునైన డైలాగ్స్ . “ఇది వద్దు తప్పు అని చెప్పడానికి ఎవడికి అధికారం వుంది? యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించింది. తప్పైతే ఎలా గుర్తిస్తుంది?” అంటూ ఆ అమ్మాయి కి బ్రెయిన్ వాష్ .

“మరి అమ్మాయి- అమ్మాయి కలిస్తే పిలల్లు పుట్టరు కదా?” అంటుంది. “భార్య భర్త ఎన్ని సార్లు సెక్స్ లో పాల్గొంటారు ? అనేక వందల సార్లు కదా ? ప్రతి సారి బిడ్డను కనడానికేనా ? కాదు కదా?… ప్లెజర్ కోసం… పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకొందాము. లేదా కృత్రిమ గర్భ ధారణ. లేదా మన ఫ్రెండ్ ఒకడు వున్నాడు కదా… వాడిని ఒక రోజు పిలుద్దాము…ముగ్గురం ఎంజాయ్ చేద్దాము. అంటూ పవర్ఫుల్ కౌన్సిలింగ్.

అక్కడ తెర పైన ఒక అమ్మాయి మరో అమ్మాయికి చెప్పినట్టే ఉంటుంది. దీన్ని చూసి లక్షల సంఖ్యలో యువ మహిళలు, పురుషులు ప్రభావితం అవుతున్నారు . అంటే మాస్ కౌన్సిలింగ్. ” అసలు అమ్మాయి పై ఇంటరెస్ట్ లేదు” అంటుంది. ” ఒక సారి టేస్ట్ చేస్తే కదా? . తొలి సారి ఎప్పుడైనా రిస్క్ అనిపిస్తుంది. కొత్తగానే ఉంటుంది. ఒక సారి ట్రై చేస్తే కదా తెలిసేది” అంటూ బకార్డి బ్రిజర్ .. తో పాటు మెల్లగా అమ్మాయిని ఒప్పించడం .. ఆ సన్నివేశం .

“అసలు ఒక అమ్మాయి మరో అమ్మాయి ని అర్థం చేసుకున్నట్టు ఏ అబ్బాయి అర్థం చేసుకోలేడు. నా జన్మ ధన్యం అంటూ ఆ అమ్మాయి మాటతో సన్నివేశం ముగుస్తుంది . అటుపై వారి రిలేషన్ యథేచ్ఛగా కొనసాగుతుంది . అప్పుడప్పుడు కొంత మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేరుతారు. ఇవన్నీ సహజం అన్నట్టు పూర్తి స్థాయిలో ఇలాంటివాటిని జస్టిఫై చేస్తూ పదునైన మాటలు.

ఇలాగె ఒక వివాహిత ఒక అబ్బాయికి ఆకర్షితురాలు కావడం… దాన్ని జస్టిఫై చేస్తూ డైలాగ్స్.తాగడం తప్పు, అమ్మాయి- అమ్మాయి, అబ్బాయి- అబ్బాయి సంబంధాలు , వివాహపూర్వ, వివాహేతర సంబంధాలు తప్పు అంటూ వాదించే కొన్ని సీన్స్ ఉంటాయి . ఇలా చేసే వారి ఇంట్లో పెద్దవారు లేదా టీచర్స్ / కౌన్సెలర్స్ వారి డైలాగ్స్ బలహీనంగా ఉంటాయి. వారిని కాలం పోకడ తెలియని, కాలం చెల్లిన జోకుల్లాగా, చాదస్తపు పీనుగుల్లాగా చూపిస్తారు.

వీరు తాము చెప్పే నీతులకు బిన్నంగా నడుచుకునే కొన్ని సన్నివేశాలు పెడతారు. చూసారా? .. అందరూ ఇంతే .. అవతలి వాడికి చెప్పేందుకే నీతులు ఉంటాయి. లేదా చేత గాని వారు వయసు ఉడిగిన వారు, లోకం పోకడ తెలియని వారు ఇలాంటి మాటలు చెబుతారు. వారి మాటల్ని ఒక చెవిలో విని మరో దానిలో వదిలెయ్యాలి. అంత కంటే టెన్షన్ పడడం వేస్ట్ ” .. ఇలా ఉంటుంది వెబ్ సిరీస్ బ్రెయిన్ వాష్.

Web Series and Web Movies and their psycho- sociological impact on netizens in India

మోరల్ కరప్షన్ మొదలయ్యింది. మద్యం , ధూమపానం, డ్రగ్స్ , డేటింగ్, ప్రీ మారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మారిటల్ సెక్స్ .. ఇవన్నీ చాలా సహజం .. సర్వసాధారణం అనే భావన ప్రబలి పోతోంది. పురుషుడిని చెడగొట్టడం ఈజీ. మన సమాజానికి నైతిక రక్షణగా వుంది మహిళలే . కుటుంబం .. వివాహం అనే వ్యవస్థలు ఇంకా బతికున్నాయంటే దానికి ప్రధాన కారణం మహిళే. ఇప్పుడు ఆ మహిళల ఆలోచనా తీరునే మార్చేస్తున్నారు . అసలు మంచికి చెడుకు వున్న నిర్వచనం మార్చేస్తున్నారు .

అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాగడం మంచి కాదు అన్నవాడు ఇప్పుడు ఒక జోకర్ .. డ్రగ్స్ వద్దన్న వాడు విలన్. అబ్బాయి- అబ్బయి ఏంది ? అమ్మాయి- అమ్మాయి ఏంది చక్కగా పెళ్లి చేసుకో” అన్నవాడు ఇప్పుడు అవుట్ డేటెడ్ ఫూల్ .

వెబ్ సిరీస్ సునామీ ఉత్తర భారతాన్ని చుట్టేసింది . దీని ప్రభావం ఏంటో తెలియాలి అంటే పూణే వీధుల్లో రాత్రి పూట తిరగాలి. ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలు వున్న చోటుకు వెళ్ళాలి . బెంగళూరు , ఢిల్లీ , ముంబై పబ్బుల్లో వచ్చేవారు ఎవరో వారి మధ్య వున్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా అని చూడాలి . ఐఐటీ ముంబై ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంత మంది లైవ్ ఇన్ రిలేషన్ లో వున్నారు .. హైదరాబాద్, బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలంలో ఎంత మందికి డ్రగ్స్ అలవాటు అయ్యిందో చూడాలి. వెల్లూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు వారాంతంలో చిత్తూరు నగరానికి వచ్చి ఏమి చేస్తారో చూడాలి .

ఇంకా చాలా వుంది . కానీ చెడును వర్ణిస్తే కొంతమంది దానికి ఆకర్షితులు అవుతారు.

వెబ్ సిరీస్ బాంబు దాడినుంచి కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను రక్షించడానికి ఎవరో రావాలి ! ఏదో అద్భుతం జరగాలి .”

-వాసిరెడ్డి అమరనాథ్

Also Read:

ఏ మాయ చేశావే?

Also Read:

అల్లిపూల వెన్నెల

Also Read:

కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్