Saturday, January 25, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Badminton: ఇండియా శుభారంభం

CWG-2022: Badminton: ఇండియా శుభారంభం

కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా బ్యాడ్మింటన్ లో ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఇండియా ఆటగాళ్ళు సత్తా చాటారు. 5-0తో సంపూర్ణ విజయం సాధించారు.

మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ లో బి. సుమిత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 21-9;21-12తో పాక్ జోడీ సయ్యద్ భట్-ఘజలా సిద్దికి పై గెలుపొందారు.

ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్ 21-7;21-12తో మురాద్ అలీపై విజయం సాధించాడు.

మూడో మ్యాచ్ లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ లో పాక్ క్రీడాకారిణి మహూల్ షాజాద్ పై 21-7;21-6 తేడాతో తలపడనుంది.

నాలుగో మ్యాచ్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టి లు 21-12;21-19 తేడాతో మురాద్ అలీ, ఎండీ భట్టి లను ఓడించారు.

ఐదో మ్యాచ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- త్రిసా జాలీ లు 21-4;21-5తో పాక్ జోడీ షాజాద్- సిద్ధికిపై గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్