Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్Surya Show: మూడో టి20లో ఇండియా విజయం

Surya Show: మూడో టి20లో ఇండియా విజయం

సూర్య కుమార్ యాదవ్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులతో రాణించడంతో వెస్టిండీస్ తో జరిగిన మూడో టి 20 మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది.

సెయింట్ కిట్స్ లోని వార్నర్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ తొలి వికెట్ కు 57 పరుగులు(బ్రాండన్ కింగ్ 20) చేసింది. మరో ఓపెనర్ కేల్ మేయర్స్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. పావెల్-23; నికోలస్ పూరన్-22; హెట్మెయర్- 20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లకు 164  పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో భువీ రెండు; హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇండియా బ్యాటింగ్ లో… కెప్టెన్ రోహిత్ వ్యక్తిగత స్కోరు 7 వద్ద రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గా బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ తొలి వికెట్ కు 105 పరుగులు చేశారు. అయ్యర్ 24; సూర్య 76 పరుగులు చేసి ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా నిరాశ పరిచి కేవలం 4కే ఔట్ కాగా, రిషభ్ పంత్-33; దీపక్ హుడా-10 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం అందించారు. 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి లక్ష్యం అందుకుంది.

విండీస్ బౌలర్లలో డొమినిక్ డ్రేక్స్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సూర్య కుమార్ యాదవ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మూడు మ్యాచ్ ల అనంతరం ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది.

Also Read : రెండో మ్యాచ్ లో విండీస్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్