Thursday, May 8, 2025
HomeTrending Newsమోదీ సర్కారు నిజాలను దాస్తోంది - జైరామ్ రమేశ్‌

మోదీ సర్కారు నిజాలను దాస్తోంది – జైరామ్ రమేశ్‌

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం నిజాలను దాచిపెడుతున్నదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరామ్ రమేశ్‌ ఆరోపించారు. మోదీ సర్కారు తన రాజకీయ ప్రయోజనాలను కాపడుకోవడం కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నదని మండిపడ్డారు. మోదీ సర్కారు మెతక వైఖరివల్లే చైనా రెచ్చిపోతున్నదని ఆయన విమర్శించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎల్‌ఏసీ దగ్గర భారత్‌, చైనా జవాన్‌ల మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో జైరామ్‌ రమేశ్‌ సోమవారం ట్విటర్‌లో స్పందించారు. చైనా నుంచి దాడులు పెరుగుతున్నా కేంద్రం మొద్దు నిద్ర పోతున్నదని, తాము మెల్కొల్పే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే సరిహద్దుల్లో భారత సైనికుల ధైర్య సాహసాలు చూసి గర్వపడుతున్నామని ఆయన ట్వీట్ చేశారు.

సరిహద్దుల్లో చైనా చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని, ప్రధాని మోదీ తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్