Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ మహిళల హాకీ: ఇండియాపై బెల్జియం గెలుపు

ప్రో లీగ్ మహిళల హాకీ: ఇండియాపై బెల్జియం గెలుపు

FIH Pro-league: ప్రో లీగ్ మహిళల హాకీలో టోర్నమెంట్ లో ఇండియా-బెల్జియం జట్ల మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో కూడా బెల్జియం 5-0 తేడాతో విజయం సాధించింది. బెల్జియం లోని అంట్వేర్ప్ లో జరిగిన ఈ మ్యాచ్ 2వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. ఆ తర్వాత 4, 19, 23, 36 నిమిషాల్లో మరో నాలుగు గోల్స్ సాధించింది. ఇండియా మహిళలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ గోల్ సాధించలేకపోయారు.

మొత్తం 9 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇండియా ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. ఇప్పటికి 10 మ్యాచ్ లు ఆడిన ఇండియా మహిళలు నాలుగు విజయాలు సాధించగా, మూడింటిలో పరాజయం పాలయ్యారు. ఒక షూటౌట్ మ్యాచ్ లో విజయం, రెండు షూటౌట్లలో ఓటమి పాలైంది. ఇండియా- ఇంగ్లాండ్ మధ్య ఏప్రిల్ 2,3 తేదీల్లో జరగాల్సిన మ్యాచ్ లు వాయిదా పడి, ఆ తర్వాత రద్దయ్యాయి.  ఈ మ్యాచ్ లలో ఇండియా విజయం సాధించినట్లు ప్రకటించారు.

ఇండియా మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్ ల్లో అర్జెంటీనా (జూన్ 18, 19); అమెరికాతో (జూన్ 21,22) రెండేసి మ్యాచ్ లు ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్