Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్శ్రీలంకతో టెస్ట్: ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా

శ్రీలంకతో టెస్ట్: ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా

Virat 100th: ఇండియా – శ్రీలంక మధ్య మొదటి టెస్ట్ నేడు మొదలైంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి నూరవ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. విరాట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అభినందనలు తెలియజేశాడు. వంద టెస్టులు ఆడడం ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే విషయం కాదని, కోహ్లీ కి ఇది వందవ టెస్ట్ కావడం తమకూ ఓ ప్రత్యేకమైనదేనని పేర్కొన్నాడు.

ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకుంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది.  రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జదేడా, జయంత్ యాదవ్ లతో పాటు పేసర్లు  జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఆడుతున్నారు. వీరితో పాటు రోహిత్ శర్మ, మయంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లు తుది జట్టులో ఉన్నారు.

ఇండియా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.  20 ఓవర్లు పూర్తయ్యే నాటికి  రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 33 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు,  హనుమ విహారీ 25, విరాట్ కోహ్లీ 2 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

విరాట్ బరిలోకి దిగుతున్న సమయంలో సహచర ఆటగాళ్ళు, ప్రేక్షకులు తమ సీట్ల లో నుంచి లేచి నిల్చొని అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్